ఫోటోలు : 106 ఏళ్ళ బామ్మ కూడా మహేష్ ఫ్యాన్ నే.. షూటింగ్ లో కలిసి భావోద్వేగానికి గురైన బామ్మ..

Mahesh Old Woman Fan

Mahesh Old Woman Fan

మహేష్ బాబు అమ్మాయిల కలల రాజకుమారుడు.. వయసు 40 దాటినా,ఇప్పటికీ యువతుల్లో మహేష్ కి ఉన్న క్రేజ్ తక్కువేమీ కాదు..అయితే తాజాగా మహేష్ జాబితాల్లో భామలే కాదు,బామ్మలు కూడా ఉన్నారు అని తెలిపే సంఘటన ఒకటి మహేష్ తన అభిమానులతో పంచుకున్నారు..

షూటింగ్ లో తనని కలవడానికి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన 106 ఏళ్ళ వయసున్న రేలంగి సత్యవతి అని మహిళ తో కలిసున్న ఫోటోలు అభిమానులతో షేర్ చేస్తూ, ఇటువంటి అభిమానులు ఉండడం తన అదృష్టంగా పేర్కొన్నారు..
“ప్రేమ అనేది వయసు పరిధులు కూడా దాటడం అనేది అద్భుతంగా అనిపిస్తుంది..తరాలుగా ప్రేమని కొనసాగుతున్న వారిని చూస్తుంటే ఎంతో గౌరవంగా అనిపించింది..నా అభిమానుల ప్రేమ నన్ను ఎప్పుడూ ఉక్కిరి బిక్కిరి చేసేదే,అయితే 106 ఏళ్ళ రేలంగి సత్యవతి గారు రాజమండ్రీ నుంచి నన్ను ఆశీర్వదించడానికి రావడం నా హృదయాన్ని స్పృశించింది..


ఆమెను సంతోషపరచడం నాకు ఎంతో తృప్తినిచ్చింది,అయితే నిజాయితీ గా చెప్పాలంటే ఆమెకంటే నేనే ఎక్కువగా సంతోషించా.. గాడ్ బ్లెస్స్ హర్..
చాలా సంతోషంగా ఉంది,ఆమె ప్రేమకు సదా కృతజ్నుడునై ఉంటా ” అంటూ పోస్ట్ చేసారు మహేష్..


మహేష్ తాజాగా మహర్షి చిత్రం లో నటిస్తున్నారు.. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2019 వేసవి కి విడుదల కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed