మా సినిమాలు చూసి కాదు.. ఆర్టిస్టులం,టెర్రరిస్టులం కాదు .. జగిత్యాల బాలల ఆత్మహత్య వ్యవహారంపై స్పందించిన హీరో కార్తికేయ.. ఏమన్నారంటే..

Kartikeya RX 100 Comments

Kartikeya RX 100 Comments

తెలంగాణా లోని జగిత్యాల లో ఇద్దరు 10 వ తరగతి బాలలు ఒక ప్రేమ వ్యవహారం పై ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ,తన చిత్రం RX 100 ని లాగడం పై నటుడు కార్తికేయ వీడియో ద్వారా స్పందించారు..

తమ సినిమాలో ఆత్మహత్య కి పురికొలిపే సన్నివేశాలు ఏమీ లేవని,అలాంటపుడు తన చిత్రాన్ని వివాదం లోకి లాగడం సరికాదు అంటూ అయన వ్యాఖ్యానించారు.. “రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట కి బాగా పేరొచ్చింది.. అయితే మా సినిమాలో ఆత్మహత్య సన్నివేశాలు లేవు.. కేవలం హీరోయిన్ హత్య చేయిస్తుంది అంతే” అని తెలిపారు..

ఇక ఏ దర్శకుడు,హీరో తమ చిత్రాలను చూసి ఆత్మహత్య చేసుకోమంటూ ప్రోత్సహించరు అంటూ కార్తికేయ తెలిపారు .. “మేము ఆర్టిస్టులం,టెర్రిరిస్టులం కాదు.. సమాజంలోని చెడు ప్రభావం పిల్లల మనసుపై పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.. ఇలాంటి సంఘటనలు ఇకముందు జరగవు అని ఆశిద్దాం” అన్నారు కార్తికేయ..

రెండు రోజుల క్రితం జగిత్యాల లోని 10 వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని ,ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే..అయితే RX 100 లోని ఆత్మహత్య సన్నివేశాలు చూసే ఈ బాలలు స్ఫూర్తి పొందారని పోలీసులు కూడా తెలపడం గమనార్హం..

ఏది ఏమైనా తల్లితండ్రుల బాధ్యత తో పాటు,సినీ దర్శకులు తాము చూపించే సన్నివేశాలు ఎదిగీ ఎదగని పసిమనసుల పై చాలా ప్రభావం చూపిస్తుంది అన్నది గుర్తించాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed