బాధ్యతాయుతమైన పౌరుడిని : పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు అంటూ వస్తున్న విమర్శలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వివరణ..నటుడు జగపతి బాబు మద్దతు..

K Raghavendra Rao Polling Booth Controversy

K Raghavendra Rao Polling Booth Controversy

నిన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో లైన్ లో ముందుకు వెళ్లనివ్వనందుకు అలిగి ఓటు వెయ్యకుండా వెళ్ళిపోయాను అని వస్తున్న వార్తలపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు.. తాను ఒక బాధ్యతాయుతమైన పౌరుడిని అని తాను ఓటు వేసా అంటూ అయన వివరణ ఇచ్చారు..

సంఘటన జరిగిన కొద్ది సేపటి క్రితం పోలింగ్ కేంద్రానికి రాఘవేంద్రరావు మళ్ళీ వచ్చారు..ఒక ప్రముఖ టీవీ ఛానల్ అసత్య వార్తను ప్రచారం చేసింది అంటూ ఆయన తెలిపారు.. ఇక అయన క్యూ లో నుంచుని ఓటు కూడా వేసి వచ్చారు..

ఈ సందర్భంగా అయన మీడియా తో మాట్లాడుతూ “నేను బాధ్యతాయుతమైన పౌరుడిని,ఆ సమయంలో నాకు వేరే పని ఉండి బయటకి వెళ్లాల్సి వచ్చింది,అంతే తప్ప నన్ను ఎవరూ బయటకి వెళ్ళమని చెప్పలేదు” అంటూ రాఘవేంద్రరావు తెలిపారు..

మరొక ప్రక్క సినీ నటుడు జగపతి బాబు రాఘవేంద్రరావు కి పరోక్షంగా తన మద్దతు తెలిపారు.. సెలెబ్రిటీలకి ప్రత్యేకంగా క్యూ లైన్లు ఉండాలి అని అయన తెలిపారు.. “ఇప్పుడు కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా ఎన్నికల సంఘం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలి” అన్నారు జగపతి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed