షాకింగ్ : మూడు అంతస్థుల స్టేజి పై నుంచి క్రింద పడిపోయిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి.. తృటిలో తప్పిన ప్రమాదం..

Chinna Jeeyar Accident Temple

Chinna Jeeyar Accident Temple

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి కి తృటిలో అతి పెద్ద ప్రమాదం తప్పింది.. రెండు రోజుల క్రితం ముక్కోటి ఏకాదశి రోజున ఒక దేవాలయ గోపురానికి పూజలు చేస్తుండగా మూడు అంతస్థుల స్టేజి నుంచి ఆయన జారిపడిపోయారు..

చిన్న జీయర్ హైదరాబాద్ కొత్తపేట లో నెలకొన్న అష్టలక్ష్మీ దేవాలయ గోపురానికి పూజ చేస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.. పూజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు అంతస్థుల స్టేజి అనూహ్యంగా కూలిపోవడంతో జీయర్ స్వామి తన శిష్యులతో సహా క్రిందకి పడిపోయారు..

అదృష్టవశాత్తూ ఆయనకి మధ్యలో పట్టు చిక్కడంతో పెద్ద ప్రమాదమే తప్పింది అంటున్నారు.. ఇక ఈ విషయమై నిర్వాహకులు మౌనం వహించగా,అక్కడే ఉన్న కొంత మంది యువకులు ఈ సంఘటన ని వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టి వైరల్ చేసేసారు..

పరిమితి కి మించి భక్తులని స్టేజి మీదకు పంపించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.. జీయర్ స్వామి వారికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ,ప్రపంచ వ్యాప్తంగా శిష్యులు ఉన్న సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed