పవన్ కళ్యాణ్ నా దేవుడే,అయినా నేను జనసేనలోకి వెళ్ళను : బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు,ఎందుకంటే.

Bandla Ganesh Pawan Kalyan

Bandla Ganesh Pawan Kalyan

పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ తరచుగా వ్యాఖ్యానించే నటుడు/నిర్మాత బండ్ల గణేష్ హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.. పవన్ అన్న,మెగా కుటుంబం అన్న విపరీతమైన ప్రేమ కురిపించేసే గణేష్ ఇలా ప్లేట్ మార్చడం పవన్ అభిమానులకే కాదు,మీడియా వారికీ కూడా షాక్ ఇచ్చింది..

ఇక ఇదే విషయమై బండ్ల గణేష్ ని ఒక టీవీ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా,గణేష్ ఆసక్తికరంగా స్పందించారు.. “మీరు పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటారు కదా,అలాంటప్పుడు అయన పెట్టిన జనసేన లోకి వెళ్లకుండా కాంగ్రెస్ లోకి వెళ్లడం వెనుక మీ ఉద్దేశం ఏంటి” అని టీవీ 5 మూర్తి ప్రశ్నించగా,దానికి గణేష్ మాట్లాడుతూ “నిజమే నాకు పవన్ కళ్యాణ్ దేవుడే,అయితే అది నా వ్యక్తిగతం,ఇది రాజకీయం,రెండూ కలపకూడదు ” అంటూ స్పందించారు..

అయితే ఇదే విషయమై మూర్తి మరింత రెట్టించగా గణేష్ ఆవేశంగా “నా పర్సనల్ అని చెప్పినప్పుడు ఎందుకు అడుగుతారు?అందుకే ఏదో ఒక కాంట్రవర్సీ అవుద్దనే ఈ ఇంటర్వ్యూల కి రాను అన్నా,నేను వెళ్ళిపోతా” అంటూ ఆవేశంగా స్పందించారు గణేష్.. అయితే మూర్తి గణేష్ ని శాంతింపజేసి బ్రేక్ ప్రకటించడం ఈ ఇంటర్వ్యూ లో కొసమెరుపు..

ఇంకా ఈ ఇంటర్వ్యూలో తాను తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయడం,గెలవబోవడం తథ్యం అంటూ ప్రకటించారు గణేష్.. కొంచెం అతిగా “భారత్ అనే నేను ” స్టైల్ లో ప్రమాణస్వీకారం కూడా చేసి,యాంకర్ కి షాక్ ఇచ్చారు గణేష్..

మొత్తం మీద ఈ వ్యవహారం లో తెల్సిందేంటంటే,రాజకీయ నాయకులకి వ్యక్తిగత జీవితం వేరు,రాజకీయం వేరు,రెండూ కలపకూడదు అనేది వారి అభిప్రాయం ..ఆ విషయం అభిమానులు కూడా గుర్తిస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed