సావిత్రిగా ప్రముఖ యాంకర్ అనసూయ.. సావిత్రి గారి ఇంట్లో పని మనిషిలా ఉన్నావ్ అంటూ ఒక ఆట ఆడుకున్న అభిమానులు..

Anasuya As Savitri Ad

Anasuya As Savitri Ad

కొన్ని పాత్రలు కొంత మందికి అచ్చిరావు.. అనుకరించడం కూడా మంచిది కాదు,తాజాగా ఈ విషయం నటి/యాంకర్ అనసూయ విషయంలో నిరూపణ అయ్యింది.. సావిత్రి ని అనుకరిస్తూ ఆమె చేసిన ఒక యాడ్,తాజాగా ఆమెపై విమర్శల జడివాన కురిసేలా చేసింది..

అనసూయ ప్రముఖ వస్త్ర వ్యాపార బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపికయ్యారు.. “ఈ విషయంగా నేను చాలా ఆత్రుత తో ఉన్న,అయితే నన్ను నేను చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నా.. మహానటి సావిత్రి గా చేయాలనే ప్రయత్నమే ,ఒక పెద్ద విజయం గా భావిస్తున్నా,అవకాశం కల్పించిన చందన బ్రదర్స్ వారికి నా ధన్యవాదాలు.. అంటూ తన యాడ్ వీడియో ని షేర్ చేసారు అనసూయ..


ఎంతో సంతోషంగా ట్వీట్ చేసిన అనసూయ కి మాత్రం ఊహించని విధంగా స్పందించి షాక్ ఇచ్చారు అభిమానులు.. “సావిత్రి గారి ఇంట్లో పని మనిషిలా ఉన్నావ్” అంటూ ఒక అభిమాని స్పందించగా,సావిత్రి పరువు తీయొద్దు అంటూ కొందరు స్పందించారు.. ఆ స్పందనలు

సోషల్ మీడియా తో ఎప్పుడూ అనసూయ కి ఇటువంటి సమస్యలు క్రొత్త ఏమీ కాదు.. అనసూయ పై వరుస ట్రోల్ల్స్ వేయడం,ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలం సోషల్ మీడియా ని వదిలేసారు కూడా.. ఇక తాజాగా అనసూయ సినీ రంగంలో మంచి ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు.. రంగమ్మత్త గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ,తాజాగా వైఎస్సార్ బయోపిక్ యాత్ర లో కీలక పాత్ర పోషిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed