పిచ్చి వీడియోలు :యూ ట్యూబ్ చానెల్స్ పై గాయని గీతా మాధురి సంచలన నిర్ణయం..

ప్రముఖ గాయని గీతా మాధురి సంచలన నిర్ణయం తీసుకున్నారు..రెండు రోజుల్లో కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ పై కేసులు పెట్టబోతున్నట్లు ఆమె ప్రకటించారు..

“నా మీద కొన్ని ఫేక్ న్యూస్ లు,ఫేక్ వీడియోలు ప్రచారం చేసినందుకు రెండు రోజుల్లో కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా” అంటూ ఆమె తెలిపారు..

“అయోతే ఈ చర్యలు తీసుకునే ముందు సదరు యూ ట్యూబ్ ఛానెల్స్ వారికి ఆ వీడియోలు తొలగించేటందుకు రెండు రోజులు సమయం ఇస్తున్నా” అంటూ మరొక ప్రకటన కూడా చేసారు..


బిగ్ బాస్ షో లో పాల్గొన్న సమయంలో కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ వారు గీతా మాధురి పై నెగటివ్ వార్తలు ప్రసారం చేసాయి..ఇదే గీతా మాధురి గారి ఆగ్రహానికి కారణం అని తెలుస్తుంది..

ఈమధ్య కాలంలో కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ వారు హిట్స్ కోసం ఫేక్ వార్తలు సృష్టిస్తున్న నేపథ్యంలో,గీత న్యాయ చర్యలు ఈ రకమైన ఫేక్ వార్తలకు కళ్లెం వేస్తుంది అని ఆశిద్దాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed