నటుడు అర్జున్ పై కన్నడ నటి శృతి హరిహారన్ మీ టూ ఆరోపణలు..షూటింగ్ లో గట్టిగా కౌగిలించుకున్నాడు అంటూ ఆరోపణలు..

సీనియర్ నటుడు అర్జున్ పై కన్నడ హీరోయిన్ శ్రుతీ హరిహారన్ మీ టూ ఆరోపణలు చేసారు..

2016 లో జరిగిన నిభునన్(తెలుగులో కురుక్షేత్రం) సినిమా షూటింగ్ లో నటన పేరుతో అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించారు అంటూ ఆమె ఆరోపణలు చేసారు..

“ఒక సీన్ లో మేము ఇద్దరం కౌగిలించుకుని మాట్లాడుకునే షాట్ ఉంది..అయితే అర్జున్ చెప్పా పెట్టకుండా నన్ను కౌగిలించుకుని,నా వెనుక భాగాన్ని నిమిరారు..

అంతే కాకుండా ఈ సీన్ లో ఉన్న ఫోర్ ప్లే ని సినిమాలో వాడుకోవచ్చా అంటూ ప్రశ్నించడం నాకు మరింత షాక్ ఇచ్చింది..
ఎన్నోసార్లు మేము రిహార్సిల్స్ చేసినా కూడా,ఇలా నేరుగా అర్జున్ నాతో అసభ్యంగా ప్రవర్తించడం నాకు దిగ్భ్రాంతి కలిగించింది.

ఈ విషయం దర్శకుడికి అర్ధమైనా కూడా ఏమీ చేయలేని పరిస్థితి..
ఈ భయానక అనుభవం నాకు 50 మంది షూటింగ్ సభ్యుల మధ్యన జరిగింది..అయినా కూడా నా వృత్తి పట్ల గౌరవం తో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది..

అర్జున్ లాంటి సీనియర్ నటుడు,సున్నితమైన నటన హద్దులు దాటి ఇలా ఎందుకు ప్రవర్తించారో నాకు అర్ధం కాదు..సినీ పరిశ్రమ లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి” అంటూ శృతి పోస్ట్ చేసారు..

ఇక ఈ విషయమై అర్జున్ స్పందించాల్సి ఉండగా,ఆయన అభిమానులు మాత్రం శృతి పోస్ట్ పై మండిపడుతున్నారు..అర్జున్ కి శృతి వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారని,250 సినిమాలు చేసినా ఎప్పుడూ చిన్న మచ్చ కూడా లేని నటుడు తమ హీరో అంటూ వారు శృతి పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed