ఆంధ్ర ఎన్నికల్లో తెరాస పోటీ చేస్తుందట.. ఓటమి భయంతోనే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?

TRS AP Contest

TRS AP Contest

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..తెదేపా అధినేత చంద్రబాబు కి చంద్రబాబు కి బుద్ధి చెప్పడం కోసం అవసరమైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెరాస పోటీ చేస్తుంది అంటూ సిల్లీ కామెంట్స్ చేసారు కే టీ ఆర్ ..

ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు.. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు. నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలుపెడతామని స్పష్టం
చేసారు..

కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని.. ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామన్నారు..అయితే కేవలం తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి భయపడే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు అనిపిస్తుంది.. ఎందుకంటే తెరాస అనేది తెలంగాణ కి చెందిన ఉద్యమం పై పెట్టిన పార్టీ,అటువంటి ఒక పార్టీ ఆంధ్ర లో పెడితే కనీసం డిపాజిట్ అయినా వస్తుందా అంటే సందేహమే..

ఇదే కాకుండా కేవలం ఒకటి,రెండు రోజులు ఉంటుంది అనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసేటంత వరకూ,మంచి స్పందన తో కొనసాగుతూ ఉండటంతో తెరాస నాయకులకి ముచ్చెమటలు పోయిస్తుంది అని అంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed