తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది కూటమే,ప్రెస్ మీట్ పెట్టి మరీ సర్వే వివరాలు వెల్లడించిన లగడపాటి.. సర్వే వివరాలు..

Telangana Lagadapati Survey

Telangana Lagadapati Survey

లగడపాటి ఈ పేరు రాజకీయ రంగంలో ఒక సంచలనం,పదవుల పరంగా కాకుండా ఈయన చేసే సర్వే ల కి విపరీతమైన క్రేజ్ ఉంది.. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో అయన చేసిన సర్వే,ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది..

క్రొద్ది సేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన లగడపాటి సర్వే ఫలితాలు చెప్పబోను అంటూనే,కూటమికే అధికారం అంటూ హింట్ ఇచ్చారు.. లగడపాటి చెప్పిన ఫలితాల సరళి ఈ విధంగా ఉంది..

8-10 మంది స్వతంత్రులు గెలుస్తారు

  • ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి రంగారెడ్డి గెలుపు
  • మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి గెలుపు ఖాయం
  • బెల్లంపల్లి నుంచి జి.వినోద్ గెలుపు
  • ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు
  • వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం
  • గత ఎన్నికల్లో 68.5 ఓటింగ్ శాతం
  • పోలింగ్ సరళిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది.
  • పోలింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టు భావించాలి
  • పోలింగ్ తగ్గితే హంగ్ వచ్చే అవకాశం
  • గతంలో వచ్చిన సీట్ల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి
  • కరీంనగర్, మహబూబ్ నగర్ పోటాపోటీ
  • ఆదిలాబాద్ లో ఎక్కువ సీట్లు ఎంఐఎం కు వెళ్తాయి

ఇక పూర్తి ఫలితాలు చెప్పాలంటే మాత్రం పోలింగ్ రోజు అంటే డిసెంబర్ 7 వరకు ఆగాల్సిందే అంటున్నారు లగడపాటి.. చూద్దాం ఈ ఆంధ్ర ఆక్టోపస్ సర్వే నిజమవుతుందో లేదో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *