రెండు లక్షల పుస్తకాల సాక్షిగా:తెలంగాణా ప్రజలు ఎవరికీ ఓటు వేయాలో వీడియో సందేశం పంపిన జనసేనాని పవన్ కళ్యాణ్.

Pawan Kalyan Telangana Elections

Pawan Kalyan Telangana Elections

తెలంగాణ ఎన్నికలపై ఎట్టకేలకు జనసేనాని తన మౌనాన్ని వీడారు..7 న జరుగబోతున్న తెలంగాణా ఎన్నికలలో ఎవరికి మద్దతు ఇస్తానో ఈరోజు న ప్రకటిస్తాను అని చెప్పిన పవన్,అన్నట్లుగానే తన మద్దతు ఎవరికో తెలుపుతూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా లో ఉంచారు..

ముందుగా దాశరధి పలుకులతో తన సందేశాన్ని మొదలు పెట్టిన జనసేనాని “అనేక ఒడిదుడుకుల మధ్యన,త్యాగాల మధ్యన తెలంగాణ యువత తెలంగాణా సాధించుకుంది.. తెలంగాణా పోరాట స్ఫూర్తిని నేను పూర్తిగా అర్ధం చేసుకున్నాను..

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మాకు తక్కువ సమయాభావం ఉండటం వల్ల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయటం లేదు.. ఇప్పుడు మన ముందున్నది తెలంగాణా ఇచ్చాము,తెచ్చాము,దించాము అనే అయోమయ పరిస్థితులలు ..

ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ఒకటే.. ఎవరైతే అత్యంత ఎక్కువ పారదర్శకత తో,తక్కువ అవినీతి ని అందిస్తారో ,ఎవరైతే మంచి పరిపాలన అందించగలుగుతారో ప్రజలు లోతుగా అలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది గా నా మనవి” అంటూ తెలంగాణ ఎన్నికల పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు పవన్..

ఎప్పుడూ రెండు లక్షల పుస్తకాలు అంటూ మాట్లాడే పవన్ ,తన ప్రసంగంలో కూడా పుస్తకాల బ్యాక్ గ్రౌండ్ ఉంచడం విశేషం.. అయితే పార్టీ పెట్టి నాలుగున్నరేళ్ల దాటుతున్నా ఇప్పటికీ స్పష్టమైన రాజకీయ విధానం గానీ,నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కానీ పవన్ రాజకీయ కెరీర్ కి మైనస్ కాదంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed