“తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాము,ప్రజలు నిలదీస్తున్నారు..”,టీవీ షో లో భాజపా ప్రభుత్వ పరువును నిలువునా తీసేసిన కేంద్ర మంత్రి గడ్కరీ..

Nitin Gadkari Comments BJP Promises

Nitin Gadkari Comments BJP Promises

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ లోని కీలక మంత్రిగా పేరున్న మంత్రి నితిన్ గడ్కరీ,ఇప్పుడు భాజపా ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టే సంచలన వ్యాఖ్యలు చేసారు.. గత ఎన్నికల్లో గెలవడం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చామని,ఇప్పుడు ప్రజలు ఆ విషయమై తమని నిలదీస్తున్నారని ఒక టీవీ షో లో ఓపెన్ అయ్యారు గడ్కరీ..

కలర్స్ టీవీ నిర్వహిస్తున్న ఒక టీవీ షో లో పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసారు.. “మేము అధికారంలోకి వస్తామన్న నమ్మకం మాకు లేదు,అందుకే భారీ హామీలు ఇవ్వమని మాకు సలహా ఇచ్చారు,ఒక వేళ మేము అధికారం లోకి రాకుంటే ఎవరూ మమ్మల్ని ప్రశ్నించే అవకాశమే ఉండదు కదా అని ఆలా చేసాము..

అయితే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం,ప్రజలు మేము ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తున్నారు..” అంటూ కుండా బ్రద్దలు కొట్టినట్లు చెప్పేసారు గడ్కరీ..

అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే గడ్కరీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసారా,లేదంటే మహారాష్ట్రలో కొలువైన భాజపా సర్కార్ గురించి చేసారా అన్నదాని పై స్పష్టత రావాల్సి ఉంది.. ఈ విషయమై ప్రస్తుతానికి భాజపా స్పందించలేదు,అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. “నిజం చెప్పారు,భాజపా అధికారం లోకి రావడం కోసం ప్రజల కలల్ని,నమ్మకాలని వాడుకుందని వారు భావిస్తున్నారు ” అంటూ ట్వీట్ చేసారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed