100 కోట్ల ఆదాయాన్ని వదులుకున్నావా? మరో సారి పవన్ కళ్యాణ్ పై విమర్శల కత్తి ఝుళిపించిన మహేష్

Mahesh Kathi Vs Pawan Kalyan

Mahesh Kathi Vs Pawan Kalyan

జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలతో అనూహ్యంగా లైం లైట్ లోకి వచ్చిన కత్తి మహేష్,కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న సంగతి తెల్సిందే,అయితే అయన తాజాగా పవన్ పై మరోసారి పవన్ పై తన విమర్శల కత్తి ని ఝులిపించారు..

రూ 100 కోట్ల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కత్తి స్పందించారు.. “రూ. 100 కోట్ల ఆదాయాన్ని మీకోసం వదులుకున్నా.. ఇక మీరే తేల్చుకోండి”: పవన్ కళ్యాణ్

లేని ఆదాయాన్ని.రాని ఆదాయాన్ని ఎట్లా వదులు కుంటావ్ పవన్? ఇప్పటివరకూ నీకొచ్చిన అత్యధిక రెమ్యునరేషన్ అజ్ఞాతవాసికి 25 కోట్లు. అలాంటి సినిమాలు నాలుగు చేస్తేగానీ సంవత్సరానికి వందకోట్లు కావు. అదే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం+బిజెపికి నువ్వు చేసిన నాలుగు నెలల ఆర్భాటానికి/ ప్రచారానికి నీకు ఎంత గిట్టుబాటు అయిందో ఖచ్చితంగా తెలిదుగానీ. తప్పకుండా 100 కోట్ల పైనే అని ఒక అంచనా.

కాబట్టి సినిమాల్లో ఆదాయం వదులుకుని నువ్వు రాలేదు. రాజకీయాలలో డబ్బు చేసుకోవడానికి నువ్వు వచ్చావు. మీ అన్న అమ్ముకున్న సీట్లు, పార్టీకి నువ్వొక కొనసాగింపు. అంతే! కాబట్టి ఆదాయాలు.త్యాగాల గురించి మాట్లాడకు.” అంటూ పోస్ట్ పెట్టారు మహేష్..

ఇక శ్రీ రాముడిపై కొన్ని నెలల క్రితం కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed