చెక్కా,క్యాషా?జనసేన లో హై టీ అంటూ లక్షలు వసూలు,కాపు కులస్తులతో రహస్య సమావేశాన్ని బట్టబయలు చేసిన ప్రముఖ మీడియా ఛానెల్..

Janasena High Tea Sting Operation

Janasena High Tea Sting Operation

కులాలు లేని సమాజం,కొత్తరకం రాజకీయం అంటూ హోరెత్తించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాటలు నీటి బుడగలేనా?అయన కూడా సాధారణ రాజకీయ నాయకుల మాదిరే రాజకీయాల్లో ధనప్రవాహాన్ని ప్రోత్సహిస్తున్నారా?తాజాగా ఒక మీడియా ఛానల్ నిన్న రాత్రి బట్టబయలు చేసిన ఒక సంచలన స్టింగ్ ఆపరేషన్ జనసేన అభిమానులకి షాక్ ఇచ్చింది..

మహా న్యూస్ అనే వార్తా ఛానెల్ ప్రసారం చేసిన ఒక కథనం ప్రకారం,జనసేన హైదరాబాద్ లోని ఒక హోటల్ లో కాపు కులస్తులతో ఒక రహస్య సమావేశం చేసింది.. High Tea(తేనేటి విందు) పేరుతొ ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో కాపు కులస్తులకు మాత్రమే అనుమతి ఉందని ఈ కథనం పేర్కొంది.. పవన్ కళ్యాణ్ ఆడిటర్ రత్నం అనే వ్యక్తి పార్టీ కి వచ్చిన అతిధుల నుంచి విరాళాలు సేకరిస్తూ కనిపించారు..

ఆడిటర్ రత్నం విరాళాలు ఇచ్చే అతిధులని చెక్కా,క్యాష్ ఆ అని అడగటంతో ఈ వీడియో పై భారీ రచ్చే రేగింది,ఇక ఈ సమావేశానికి హాజరు అయినవారు తప్పకుండ 10 లక్షలు లేదా అంతకు మించి విరాళం ఇవ్వాల్సిందే,అంతకు తక్కువ ఇస్తే తీసుకోరు అని కూడా ఈ కథనం తెలిపింది..