విజయ్ దేవరకొండ మరో సంచలనం,”నోటా” సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో చెప్పాలంటూ అభిమానులకి ప్రశ్న..

Vijay Deverakonda NOTA Release Date

Vijay Deverakonda NOTA Release Date

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు విజయ్ దేవరకొండ సరిక్రొత్త ట్రెండ్ కి తెర లేపారు,తన తాజా చిత్రం “నోటా” విడుదల తేదీ ని నిర్ణయించే అధికారం అభిమానులకే వదిలేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు..

“ఒక సినిమా ని విడుదల చేయడానికి మంచి రోజులు,చెడు రోజులు కూడా ఉంటాయి.. అయితే “నోటా” విడుదల చుట్టూ మాత్రం డ్రామా నడుస్తుంది.. కాబట్టి మీరే నాకు చెప్పండి నాకు ఈ సినిమా ని ఎప్పుడు విడుదల చేయండి,ఇక్కడ మీరు ఓట్ చేయండి.. అధికారిక విడుదల తేదీ ని రేపు ప్రకటిస్తా” అంటూ ట్వీట్ చేసారు విజయ్…

ఈ సందర్భంగా అయన అక్టోబర్ 8,10,18 అంటూ మూడు తేదీల ని ముల్టీపుల్ ఛాయస్ రూపం లో ఇచ్చారు,ఇక నాలుగో ఆప్షన్ గా “నోటా” అని కూడా ఇచ్చారు.. ఇప్పటివరకు 8276 ఓట్లు పోల్ అవ్వగా ,అందులో 36%మంది అక్టోబర్ 5 వ తేదీ ని ఎంచుకోగా,35% మాత్రం నోటా (పైవేమీ కాదు) అని ఎంచుకున్నారు.. ఇక 13% మంది అక్టోబర్ 10 ని ఎంచుకోగా,16% మంది అక్టోబర్ 18 ని ఎంచుకున్నారు..

అయితే విజయ్ ఇలావిడుదల తేదీ కి ఓటింగ్ నిర్వహించడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ‘డ్రామా” నడుస్తుంది అని చెప్పడం ద్వారా నిర్మాతలతో తనకి ఏమైనా విభేదాలు ఉన్నాయి అని అభిమానులకి హింట్ ఇస్తున్నాడా అని చర్చ జరుగుతుంది.. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో నడుస్తుంది.. తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న నోటా లో ,మెహ్రీన్ కౌర్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషించారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed