వీడియో : అచ్చం అన్నగారిలాగే.. రేపల్లె వీధుల్లో ఎన్టీఆర్ బయోపిక్ కోసం రిక్షా తొక్కిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో …

NTR Biopic Leaked Video

NTR Biopic Leaked Video

నటుడు నందమూరి బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ,నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం అత్యంత వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ చిత్రం కోసం దర్శకుడు క్రిష్ చిన్న చిన్న విషయాలపై కూడా చాలా శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తుంది… ముఖ్యంగా నటీనటుల ఎంపిక,వారి ఆహార్యం విషయంలో అస్సలు రాజీ పడలేదు..

తాజాగా ఈ చిత్ర షూటింగ్ గుంటూరు జిల్లా రేపల్లెలో జరుగుతుంది.. ఆ షూటింగ్ లో బాలయ్య ,ఎన్టీఆర్ మాదిరి వేషధారణలో రిక్షా తొక్కుతున్న సన్నివేశం సోషల్ మీడియా లో లీక్ అయింది.. వైట్ & వైట్ ధరించి అన్న గారి మాదిరి పెద్ద టోపీ ధరించిన బాలయ్య నటించిన ఈ సన్నివేశం రేపల్లె రాజకీయాల గురించి అని సమాచారం..

ఇక ఈ వీడియో లో బాలయ్య ని చూసిన నాటి తరం వారు సైతం ఒక్క క్షణం మనం ఎన్టీఆర్ ని చూసామా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు.. ఈ సన్నివేశం చిత్రీకరణ నిన్న ఆదివారం రేపల్లె లో జరిగింది.. చిత్ర విడుదల కి చాలా తక్కువ సమయం ఉండటంతో ఆదివారం కూడా షూటింగ్ జరిపారు క్రిష్ బృందం..

ఇక ఇదే మాదిరి వైట్ అండ్ వైట్ పెద్ద టోపీ వేసి హుంగామా చేసారు నటుడు సుమంత్ కూడా,సుమంత్ ఈ చిత్రం లో తన తాత గారైన అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే..

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా నిర్మించనున్నారు.. మొదటి భాగం కథానాయకుడు ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని తెర పై చూపించనుండగా,రెండో భాగం మహానాయకుడు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపించనుంది.. కథానాయకుడు జనవరి 9-2019 న సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా,మహానాయకుడు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24,2019 న విడుదల కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed