కాలీవుడ్ లో కలకలం : విశాల్ నన్ను టాయిలెట్ లా వాడుకున్నాడు అంటూ నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు..

Vishal Sri Reddy Controversy

Vishal Sri Reddy Controversy

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంటూ మినీ యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన నటి శ్రీ రెడ్డి,ఎట్టకేలకు కాలీవుడ్ లో నట/దర్శకుడు లారెన్స్ అవకాశం ఇవ్వడంతో కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న సంగతి తెల్సిందే..

అయితే తాజాగా ఈ ఉదయం మరోసారి శ్రీ రెడ్డి తన గళాన్ని వినిపించారు.. ఈసారి నటుడు/నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ పై శ్రీ రెడ్డి సంచలన ఆరోపణల మోత మోగించారు..ఈ ఉదయం ఫేస్ బుక్ లో ఉంచిన ఒక పోస్ట్ లో విశాల్ పేరు నేరుగా చెప్పకుండా శ్రీ రెడ్డి ఈ ఆరోపణలు చేసారు..

“నన్ను పబ్లిక్ టాయిలెట్ లా వాడుకున్నాడు.. ఆ గాయాలు ఇప్పటికీ నయం కావట్లేదు.. మానసికంగా చాలా అలజడిగా ఉంది…. ఇక్కడ (కాలీవుడ్) లో నేను ఉన్నాను,అయితే ఇది కేవలం నా శవం సినిమా ఆఫర్ల కి ఒప్పుకున్నట్లుగా ఉంది .. నా మనసు అయితే నాతో లేదు..

నన్ను నమ్మండి అప్పుడు జరిగినవన్నీ నా జీవితాన్ని నాశనం చేసాయి,ఇప్పుడు ఒక తమిళ హీరో నా సినిమా అవకాశాలను కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు,అతను ఒక అమ్మాయిల పిచ్చోడు,తెలుగు సినిమా వాళ్ళకి బాగా క్లోజ్ కూడా,ఇక నేను ఈ భూమి మీద బ్రతికి ఉండాలా,వద్దా? అంటూ సంచలన పోస్ట్ చేసారు శ్రీ రెడ్డి..

ఇక ఇదే విషయం పై విశాల్ స్పందించాల్సి ఉంది,టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి ఎందరో పెద్ద హీరోలు,దర్శకులపై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed