హీరోయిన్ తనుశ్రీ దత్తా చెప్పింది నిజమే..నానా పాటేకర్ ఉదంతంలో అప్పట్లో ఆమె కారు పై దాడి,కారు ని కొట్టి,పైకెక్కి.. ఒళ్ళు జలదరింప చేసే వీడియో బయటకు..

Tanushree Dutta Attack Video

Tanushree Dutta Attack Video

సీనియర్ నటుడు నానా పాటేకర్ కొన్నేళ్ల క్రితం షూటింగ్ స్పాట్ లో తనని లైంగికంగా వేధించారు అని నటి తనుశ్రీ దత్తా సంచలన ఆరోపణల ఉదంతం,క్రొత్త మలుపు తిరిగింది.. ఆ సంఘటన జరిగిన రోజు తీసినప్పుడుగా చెప్తున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియా లో ప్రత్యక్షమైంది.

తనుశ్రీ కారు పై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తున్న వీడియోని సోషల్ మీడియా లో ఒక నెటిజెన్ షేర్ చేసారు.. సుమారుగా రెండున్నర నిముషాలు ఉన్న ఆ వీడియో లో,ఒక వీడియోగ్రాఫర్ తన కెమెరా తో కారు అద్దాన్ని గుద్దుతూ కనిపించారు.. ఆ సమయంలో తనుశ్రీ కారు వెనుక సీట్లో కూర్చుని,చాలా ఆందోళన గా కనిపించరు..

ఆమె కారు ని కొంత మంది చుట్టుముట్టగా మరొక వ్యక్తి ఏకంగా కారు పైకి ఎక్కి నృత్యం చేసారు,ఈ సంఘటన లో కారు ధ్వంసం అయింది.. ఇక ఆ దుండగులు కారు డోర్ లాగి ,తనుశ్రీ ని బయటకి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో,చివరికి పోలిసుల రంగప్రవేశంతో తనుశ్రీ క్షేమంగా బయటపడ్డారు..

2009 లో హార్న్ ఓకే ప్లీజ్ అనే చిత్రం షూటింగ్ లో జరిగిన సన్నివేశాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు,ఈ సినిమాలో నిజానికి అవసరం లేకపోయినా ఒక పాటలో నానా పాటేకర్ ని బలవంతంగా చొప్పించారని,అంతే కాకుండా నానా తనని తాకుతూ స్టెప్స్ వేసేలా కావాలని ప్లాన్ చేసారు అని తనుశ్రీ ఆరోపించారు.. “అక్షయ్ కుమార్,రజనీ కాంత్ లాంటి నటులు నానా పాటేకర్ తో నటించడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారు” అంటూ ఆమె ప్రశ్నించారు..

తనతో బలవంతంగా ఆ పాట కి స్టెప్స్ వేయించారని ఆమె ఆరోపిస్తున్నారు..ఇక ఇదే విషయమై ఆరోజు షూటింగ్ స్పాట్ లో ఉన్న ఒక విలేఖరి తాజాగా ట్విట్టర్ లో తనుశ్రీ చెప్పిన సంఘటనని ధ్రువీకరించారు.. తనుశ్రీ తో బలవంతంగా ఆ పాట చేయించడంతో ఆమె వానిటీ వ్యాన్ లోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకున్నారని,ఆమెను ఆ వ్యాన్ లోంచి బయటకి తీసుకురావడానికి గుండాలని కూడా ప్రయోగించారని ఆ విలేఖరి తెలిపారు..

అయినా కూడా ఆమె బయటకి రాకపోవడంతో చివరికి ఆమె తల్లితండ్రులు వచ్చి,ఆమెను బయటకి తీసుకువచ్చారు అని తెలిపారు ఆ విలేఖరి..ఇక ఈ విషయంలో తనుశ్రీ కి బాలీవుడ్ హీరోయిన్ల నుంచి మద్దతు పెరుగుతుండగా,అమితాబ్ బచ్చన్ మాత్రం తాను ” ఈ విషయం పై స్పందించడానికి తాను నానా పాటేకర్ కానీ,తనుశ్రీ ని కానీ కాను ” అంటూ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు..

ఇక “నిజానిజాలు తెలియకుండా తాను ఈ విషయం గురించి మాట్లాడను,కాకపోతే ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగుంటే మాత్రం దురదృష్టకరం.. విచారణ జరుగనివ్వండి” అంటూ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించారు…
ఇక తనుశ్రీ వ్యవహారంలో తాను ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను,నోటీసులు పంపించాను అంటూ నానా పాటేకర్ వ్యాఖ్యానించగా,తనకు ఎటువంటి నోటీసులు అందలేదు అంటూ తనుశ్రీ వ్యాఖ్యానించారు..

తనుశ్రీ సంఘటన జరిగిన ఇన్నేళ్ల తరువాత అయినా బయటకి రావడం పట్ల మహిళా నటీమణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. హాలీవుడ్ లోని మీ టూ ,ఇంకా టాలీవుడ్ లో శ్రీ రెడ్డి ఉదంతాలలో తనుశ్రీ ని పోలుస్తున్నారు..

4 thoughts on “హీరోయిన్ తనుశ్రీ దత్తా చెప్పింది నిజమే..నానా పాటేకర్ ఉదంతంలో అప్పట్లో ఆమె కారు పై దాడి,కారు ని కొట్టి,పైకెక్కి.. ఒళ్ళు జలదరింప చేసే వీడియో బయటకు..

 1. Thanks for your personal marvelous posting! I genuinely enjoyed reading it,
  you can be a great author.I will always bookmark your blog and
  will come back someday. I want to encourage one to continue your great work, have a nice
  weekend!

 2. My brother recommended I would possibly like this web
  site. He used to be entirely right. This submit actually made my day.
  You cann’t consider simply how a lot time I had spent for this information!
  Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed