ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై నిప్పులు చెరిగిన శ్రీ రెడ్డి,అయన మానసిక రోగి అంటూ తీవ్ర వ్యాఖ్యలు.. వివరాలు..

Rajendra Prasad Sri Reddy Controversy
కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం అంటూ లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీ రెడ్డి వ్యవహారం,రోజు రోజుకి అంతుచిక్కకుండా తయారవుతుంది.. ఈమె నోటిలో ఎప్పుడు ఏ నటుడు/నటి పడతారో తెలియక అందరూ టెన్షన్ లో ఉంటే,తాజాగా ఈమె తన మాటల తూటాలను సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పై గురిపెట్టారు.
“రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మానసిక రోగి.. ఇప్పుడే వెళ్లి పిచ్చి ఆసుపత్రిలో చేరండి.. మీ డిక్షనరీ లో మహిళలకి చోటు లేదని నాకు తెల్సు.. మీ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెళ్లడిస్తా” అంటూ ఒక సంచలన సందేశాన్ని సోషల్ మీడియా లో ఉంచారు శ్రీ రెడ్డి..
అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.. శ్రీ రెడ్డి ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ తరహా ఆరోపణలు చేస్తుంటారు కనుక రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఇదే ఉద్దేశంతో టార్గెట్ చేసారా,లేదా మరేదైనా సంగతి ఉందా అని తెలియాల్సి ఉంది..
అయితే కొంతమంది మాత్రం “బేవార్స్” అనే సినిమా ఆడియో ఫంక్షన్ లో ,రాజేంద్రప్రసాద్ తన కుమార్తె గురించి మాట్లాడుతూ తమ కుమార్తె ప్రేమ వివాహం చేస్కోవడం వాళ్ళ,ఇంట్లోంచి పంపేసాను అని,ఆమెతో కొన్నేళ్లుగా మాటలు లేవు అని.. అయితే ఈ చిత్రంలోని ఒక పాట విపరీతంగా నచ్చి,తనకి మాటలు లేకపోయినా కుమార్తెను ఇంటికి పిలిచి మరీ ఆ పాట వినిపించాను అని చెప్పారు.. మరి ఈ విషయంగా రాజేంద్రప్రసాద్ ని శ్రీ రెడ్డి టార్గెట్ చేసారా అని తెలియాల్సి ఉంది..
ఒకప్పుడు కామెడీ హీరోగా అద్భుత హాస్యరస చిత్రాలను అందించిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు,ప్రస్తుతం సినిమాలు తగ్గించారు.. ఎక్కువగా తండ్రి,ఇంకా ఇతర ముఖ్యపాత్రల్లో అయన ఇప్పటి సినిమాల్లో మెరుస్తున్నారు..