ఎప్పుడూ చూసినా ఫోన్,నాని విసుగు తెప్పిస్తాడు..నాని ని ఆటపట్టిస్తూ కింగ్ సోషల్ మీడియా లో వీడియో పెట్టిన నాగార్జున .. సంగతేంటంటే..

Nagarajuna Nani Annoying Friend

Nagarajuna Nani Annoying Friend

కింగ్ నాగార్జున,హీరో నాని ల కాంబినేషన్ లో మొదటిసారిగా మల్టీ స్టారర్ గా దేవదాస్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా షూటింగ్ స్పాట్ లో నాని ప్రవర్తన ని ఆటపట్టిస్తూ కింగ్ నాగార్జున ఒక వీడియో అప్లోడ్ చేసారు,ఇపుడు అది వైరల్ గా మారింది..

24 సెకండ్ల నిడివి ఉన్న ఈ చిరు వీడియో లో,ముందు నాగార్జున ఫోన్ మాట్లాడుతూ బిజీ గా కనిపిస్తారు.. ఆ తర్వాత యాంకర్ తో “ఆ ఎదో అడిగారు.. ఫోన్ తో బిజీ.. దాస్(నాని ) కి ఇదొక అలవాటుగా మారిపోయింది..ఆ ఫోన్ లో ఏమి చూస్తున్నాడో కూడా తెలియదు,ప్రక్కన ఉన్న అందమైన అమ్మాయిని కూడా పట్టించుకోడు” అంటూ సెటైర్ విసిరారు నాగార్జున..

ఇక ఇలాంటి స్నేహితులు మీకు కూడా ఉంటె ట్యాగ్ చేయండి అంటూ సోషల్ మీడియా లో సవాల్ విసిరారు నాగార్జున.. ఈ వీడియో పై “ఓరి దేవుడా” అంటూ నాని సరదాగా స్పందించగా,ఇక నాని,నాగ్ అభిమానులు అయితే పండగ చేసుకున్నారు…

ఈ వీడియో పై నటుడు ఆదర్శ్ బాలకృష్ణ స్పందిస్తూ “హాహా.. ఇది నవీన కాలపు జబ్బు,నాకు కూడా ఉంది ఈ జబ్బు” అని ట్వీట్ పెట్టారు..

ఇక అభిమానులు కూడా తమ తమ స్నేహితులని ఈ సరదా ట్వీట్ లో ట్యాగ్ చేస్తూ సందడి చేసారు.. “శమంతకమణి” విజయం తర్వాత యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య రూపొందిస్తున్న “దేవదాస్” చిత్రం ఈ నెల 27 న విడుదల కానుంది..

ఈ చిత్రం లో నాగ్ మాఫియా డాన్ పాత్రలో నటిస్తుండగా,నాని అతనితో తిప్పలు పడే సైకాలిజిస్టు పాత్రలో నవ్వులు పంచనున్నారు.. మొదటి సారి నాగ్ -నాని నటిస్తున్న చిత్రం కావడం తో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి,చూద్దాం మరి ఆ అంచనాలు ఈ దేవ- దాసు లు అందుకుంటారో లేరో ..

1 thought on “ఎప్పుడూ చూసినా ఫోన్,నాని విసుగు తెప్పిస్తాడు..నాని ని ఆటపట్టిస్తూ కింగ్ సోషల్ మీడియా లో వీడియో పెట్టిన నాగార్జున .. సంగతేంటంటే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed