మహేష్ బాబు ఒక బండ రాయి,నటన రాదు,తమిళ హాస్య నటుడి అవమానకర వ్యాఖ్యలు.. నిప్పులు కక్కుతున్న ప్రిన్స్ అభిమానులు..

Manoj Prabhakar Mahesh Babu Controversy

Manoj Prabhakar Mahesh Babu Controversy

తమిళ నాట ప్రఖ్యాతి గాంచిన స్టాండ్ అప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్ మహేష్ బాబు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.. మహేష్ బాబు కి నటించడం రాదూ అంటూ మనోజ్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

ఒక స్టాండ్ అప్ కామెడీ షోలో మనోజ్ మాట్లాడుతూ ‘మహేష్ బాబు కు అసలు నటనే రాదు, ఆయనది రాయి లాంటి మొహం .. స్పైడర్‌ సినిమాలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటిస్తుంటే హీరో మహేష్ మాత్రం ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా అలా చూస్తుండిపోయాడు’ అంటూ ఎస్ జే సూర్య తో పోలుస్తూ మహేష్ ని అవమానించారు మనోజ్..

అక్కడితో ఆపకుండా మనోజ్ మహేష్ మొహాన్ని అక్కడే ఉన్న పెద్ద పెద్ద రాళ్లతో పోలుస్తూ కించపరిచే ప్రయత్నం చేసారు.. ఇక మహేష్ ని బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ని పోలుస్తూ,”ఆమె మహేష్ కి ఫిమేల్ వెర్షన్ (మహిళ రూపం లోని మహేష్),చూడడానికి అందంగానే ఉంటారు కానీ నటించడం రాదు అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేసారు..”


ఒక షో లో “జీవం లేని వస్తువులు,సినిమా లో ముఖ్య పాత్రలు” అనే అంశం మీద కామెడీ చేస్తూ మనోజ్ ఈ వ్యాఖ్యలు చేసారు,ఈ వ్యాఖ్యలపై మహేష్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.. “మీ హీరో విజయ్,మా మహేష్ సినిమాలు చేసి పైకొచ్చాడు,నువ్వు ఆంధ్రా కి రా చేసుకొందాం” అని కొందరు వ్యాఖ్యానించగా,మరి కొంత మంది “స్టాండ్ అప్ కామెడీ అంటే కామెడీ చేయాలి గానీ,పక్కోడి మీద కామెంట్స్ కాదు” అంటూ గట్టిగా క్లాస్ పీకారు..

ఇక ఇదే విషయమై మనోజ్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ తాను ఇదంతా సరదాకి చేసాను,కానీ మహేష్ ని కానీ,ఆయన అభిమానులని కానీ కించపరిచే ఉద్దేశం లేదని,ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలి అంటూ పోస్ట్ చేసారు.. అయితే ఈ విషయమై మహేష్ అభిమానులు మాత్రం ఆగ్రహం తో రగిలిపోతూనే ఉన్నారు..

అసలు స్టాండ్ అప్ కామెడీ అంటే ఏంటి ?

స్టాండ్ అప్ కామెడీ అనేది ఈ మధ్యనే మన దేశంలో బాగా పాపులర్ అయింది,ఎక్కువగా హిందీ లో ఈ రకమైన కామెడీ షో లు ఉన్నాయి యూ ట్యూబ్ లో.. ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని చక్కగా జోక్స్ చెప్పి,రకరకాల హావభావాలు ప్రకటించి,ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించడమే ఈ షో ఉద్దేశం.. మనోజ్ ప్రభాకర్ కూడా ఈ మధ్యనే ఈ రంగంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఎదుగుతున్నారు..

అయితే అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా మనోజ్ కామెడీ చేయడం సబబు కాదు.. ఇకనైనా మనోజ్ ఒకటికి రెండు సార్లు అలోచించి కామెడీ చేయాలనీ కోరుకుందాం..

తెలుగులో స్టాండ్ అప్ కమెడియన్స్ దాదాపుగా లేరనే చెప్పాలి,ఇక తాజాగా ఈ రంగంలోకి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం “The Great Laughter Challenge” అనే షో ద్వారా తెరంగేట్రం చేయనున్నారు,బ్రహ్మానందం జడ్జి గా వ్యాఖ్యానించే ఈ కార్యక్రమం అతి త్వరలో స్టార్ మా లో ప్రసారం కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed