మరోసారి తండ్రైన యాంగ్రీ హీరో గోపీచంద్.. సోషల్ మీడియా లో శుభాకాంక్షల వెల్లువ..

Gopichand Baby Boy

Gopichand Baby Boy

ప్రముఖ కథానాయకుడు,యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరొందిన హీరో గోపీచంద్ రెండోసారి తండ్రి అయ్యారు.. వినాయక చవితి రోజున నా తాను తండ్రి అయ్యాను అంటూ సోషల్ మీడియా లో ప్రకటించారు గోపీచంద్..

ఈ సంతోషకరమైన విషయాన్ని సోషల్ మీడియా లో పంచుకుంటూ “ఒక మగ శిశువు కి తండ్రి అయ్యా,ఈ వినాయక చవితి కి ఇంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదు” అంటూ పోస్ట్ చేసారు..

గోపీచంద్ తన భార్య రేష్మ గర్భం దాల్చిన విషయాన్నీ రహస్యంగా ఉంచి,ఒక్కసారిగా అభిమానులకి ఈ సంతోషకరమైన వార్త చెప్పారు.. కాగా గోపీచంద్ కి మొదటి సంతానం కూడా ఒక బాబు నే కావడం విశేషం.. 2014 లో విరాట్ కృష్ణ అనే బాబు గోపీచంద్ కి తొలి సంతానం..

అభిమానులు,సినీ పరిశ్రమ ప్రముఖులు గోపీచంద్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు..

గోపీచంద్ సతీమణి రేష్మ ,ప్రముఖ నటుడు శ్రీకాంత్ కి మేనకోడలు అన్న సంగతి తెల్సిందే.. ఇక ఈ వార్త గోపీచంద్,శ్రీకాంత్ కుటుంబాల్లో పండుగ సంబరాలని మరింత పెంచబోతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed