ఫోటోలు : సౌందర్యలహరి,స్వప్న సుందరి అంటూ హీరో శ్రీకాంత్ ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్ దీప్తి భట్నాగర్ గుర్తున్నారా?వయసు 50 దాటినా ,ఆమె అందం ఏ మాత్రం తరగలేదు..

Deepthi Bhatnagar Latest Pics

Deepthi Bhatnagar Latest Pics

ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు కానీ,దాదాపుగా 22 ఏళ్ళ క్రితం వచ్చిన పెళ్ళిసందడి చిత్రంలో స్వప్న సుందరి గా ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది భామ దీప్తి భట్నాగర్ అనే ఉత్తరాది భామ అప్పట్లో టాలీవుడ్ లో పెను సంచలనమే రేపారు.. మొహం చూపించకుండా కేవలం ఆమె నాభిని మాత్రమే చూపిస్తూ,ఆమె ఆ చిత్రం లో చేసిన పరిచయ గీతం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది,ఒక రకంగా దీప్తి ది ఆ చిత్ర భారీ విజయంలో పెద్ద పాత్రే అని చెప్పాలి ..

ఇక ఆమె ఆ తర్వాత నాగార్జున తో చేసిన ఆటో డ్రైవర్ పెద్దగా సక్సెస్ కాలేదు.. 2004 లో ఆమె నటనకు గుడ్ బాయ్ చెప్పారు.. కట్ చేస్తే దాదాపుగా 14 ఏళ్ళు తర్వాత ఇప్పుడు ఈ భామ తన వయసు 50 దాటినా,ఏ మాత్రం కనపడని వయసుతో యువ హీరోయిన్ల కి కూడా గట్టిగా పోటీ ఇస్తున్నారు..

దీప్తి ప్రస్తుతం “ట్రావెల్ విత్ మీ ” అనే యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచాన్ని పరిచయం చేసే టూరిజం వీడియోలు చేస్తున్నారు..

దీప్తి రామ్ శాస్త్ర అని చిత్రం ద్వారా 1995 లో ఎంట్రీ ఇచ్చారు,ఆ చిత్రం పెద్ద పేరు తీసుకురాలేకపోయినా 1996 లో వచ్చిన పెళ్లి సందడి మాత్రం ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చింది.. అయితే చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం దక్కలేదు..

ఇక 1998 లో నాగార్జున తో ఆమె చేసిన ఆటో డ్రైవర్ కూడా అనుకున్న విజయం సాధించలేదు,1999 లో సుల్తాన్ లో బాలయ్య తో ఆడిపాడారు దీప్తి.. 2000 వ సంవత్సరం లో తెలుగు,తమిళం,హిందీ ల లో “కామ” అనే బి గ్రేడ్ చిత్రం లో ఆమె నటించారు.. అదే సంవత్సరం ఆమె రాజశేఖర్ తో “మా అన్నయ్య” చిత్రం లో ఒక అతిధి పాత్రలో మెరిసారు..


ఇక 2001 లో ఆమె స్టార్ ప్లస్ ఛానల్ లో యాత్ర, అనే ఆధ్యాత్మిక టూరిజం షో ముసాఫిర్ హుం యారీన్ అనే టూరిజం షో చేసారు .. ఆ షో ల లో భాగంగా ఆమె 80 దేశాలను 6 ఏళ్ళ కాలం లో సందర్శించి ప్రేక్షకులకి చూపించారు..

అదే షో డైరెక్టర్ రణదీప్ ఆర్య ని దీప్తి వివాహం చేసుకున్నారు,వీరికి ఇద్దరు సంతానం శుభ్ ,శివ్ .. ప్రస్తుతానికి వీరిద్దరూ టీనేజ్ లో ఉన్నారు.. అసలు దీప్తి అంత పెద్ద పిల్లలకి తల్లి అంటే నమ్మడం కష్టమే..

5 thoughts on “ఫోటోలు : సౌందర్యలహరి,స్వప్న సుందరి అంటూ హీరో శ్రీకాంత్ ఆకాశానికి ఎత్తేసిన హీరోయిన్ దీప్తి భట్నాగర్ గుర్తున్నారా?వయసు 50 దాటినా ,ఆమె అందం ఏ మాత్రం తరగలేదు..

  1. I’ve read some just right stuff here. Definitely worth bookmarking for revisiting.
    I wonder how a lot effort you set to create this sort of excellent
    informative website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed