శబరిమల అయ్యప్ప దర్శనానికి మహిళలకి పచ్చ జెండా.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీమ్ కోర్ట్.. వివరాలు..

Sabarimala Women Entry

Sabarimala Women Entry

ఎన్నో ఏళ్ళుగా 10-50 సంవత్సరాల వయసు గల మహిళల పై శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం పై ఉన్న ఆంక్షలను సుప్రీమ్ కోర్ట్ రద్దు చేసింది… శతాబ్ద కాలంగా శబరిమల ఆలయంలో అమలవుతున్న ఆంక్షలను రద్దు చేస్తూ,అన్ని వయసుల మహిళలూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్ళవచ్చు అంటూ ప్రకటించింది..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ని పేర్కొంటూ సుప్రీమ్ ఈ ఆదేశాలు జారీ చేసింది,ఈ ఆర్టికల్ ప్రకారం లింగ బేధం లేకుండా ప్రతి ఒక్కరికి మత సంబంధమైన విషయాల్లో సమానమైన హక్కులు ఉంటాయి..

ఐదుగురు జడ్జి లు పాల్గొన్న ఈ కేసు విచారణలో ,ఒక జడ్జి ఇందూ మల్హోత్రా మాత్రం ఈ తీర్పుతో విభేదించారు.. “ఈ విధంగా మహిళలను శబరిమల ఆలయంలో ప్రవేశాన్ని నిషేధించడాన్ని మాత విశ్వాసం గా భావించరాదు” అంటూ కోర్టు పేర్కొంది..

అయ్యప్ప స్వామి ని భక్తులు “నైష్ఠిక బ్రహ్మచారి” గా భావిస్తారు,దీనితో శబరిమల ఆలయంలోకి నెలసరి వచ్చే మహిళల ప్రవేశం పై శతాబ్ద కాలంగా నిషేధం ఉంది.. అయితే ఇపుడు ఈ నిషేధాన్ని ఎత్తివేయడం సంచలనం రేపింది..

తీర్పు పై ఆలయ ప్రధాన తంత్రి (అర్చకుడు) స్పందిస్తూ ఇది బాధాకరమే అయినా,సుప్రీమ్ కోర్ట్ తీర్పు ని గౌరవిస్తాము అని తెలిపారు.. ఇక ఈ తీర్పు పై రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ట్రావంకోర్ దేవస్థానం బోర్డు తెలిపింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed