ఫ్లాష్ : పెట్రోల్ ,డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వివరాలు..

Petrol Price Decreased

Petrol Price Decreased

రోజురోజుకి మండిపోతున్న పెట్రోల్/డీజిల్ ధరల పై ఆందోళన చెందుతున్న ప్రజలకి కొద్దిగా ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ధరలు తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది.

ఈ నిర్ణయం ప్రకారం పెట్రోల్/డీజిల్ ధరల పై కేంద్ర ప్రభుత్వం రూ 1.50 ఎక్సయిజ్ సుంకం మినహాయింపు ప్రకటించగా,ఆయిల్ కంపెనీలు మరొక 1 రూపాయి తగ్గించబోతున్నాయని కేంద్రం ప్రకటించింది.. ఈ ప్రకారం మొత్తం ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్/డీజిల్ పై మొత్తం రూ 2.50 ధర తగ్గనుంది. దాదాపుగా నేడు పెట్రోల్ ధర రూ 90 కి చేరిన నేపథ్యంలో ఈ ధరల తగ్గుదల కొద్దిగా ఉపశమనం కలిగించేదే అని భావిస్తున్నారు..

మరొక ప్రక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరో రూ 2.50 వరకు వ్యాట్ ను తగ్గించాలని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్ర ప్రభుత్వాలని కోరారు… ఇందుకు గుజరాత్,మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలుపగా,ఆంధ్ర ప్రదేశ్ గత నెలలోనే రూ 2 వ్యాట్ ను తగ్గించడం గమనార్హం.. తగ్గించిన ధరలు వెంటనే అమల్లోకి రాబోతున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించారు..

ఎక్సయిజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో కేంద్రం పై రూ 10500 కోట్లు అదనపు భారం పడబోతున్నట్లు సమాచారం.. ఇక పెట్రోల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో ఆయిల్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed